లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్
ప్రజాశక్తి - లింగసముద్రం : జగనన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని కలెక్టర్ హరి నారాయణ్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని పెంట్రాల, లింగసముద్రంలోని జగనన్న హౌసింగ్ లేఔట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రెడు చోట్ల లభ్ధి దారులతో మాట్లాడారు. అధికారులందరూ సమస్వయంతో పని చేయాలన్నారు. హౌసింగ్ కాలనీలను వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం చేయాడానికి ముందే విద్యుత్ నీటి సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, జిల్లా అధికారులు,తహశీల్దార్, సుధాకర్,ఎంపిడిఒ శేషుబాబు ఉన్నారు.










