కురబలకోట : హౌసింగ్ లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోకపోతే ఇంటి పట్టాలను రద్దు చేసి వేరే వారికి ఇచ్చేస్తామని డివిజనల్ అభివద్ధి అధికారి లక్ష్మీపతి అన్నారు. శనివారం మండలం గ్రామ సచివాలయంలో హౌసింగ్ అధికారులు లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు సొంతింటి కల సాకారం చేసుకోవాలని పభుత్వం ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు ఇచ్చి హౌసింగ్ కింద మంజూరు చేశారని అన్నారు. మండలంలో ఇంటి పట్టాల, స్థలాలు కేటాయించినా కూడా లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోక పోవడం సరికాదన్నారు. కంటే వారిపల్లి వద్ద ఉన్న జగనన్న లేఅవుట్‌లో వారంలో పునాదులు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు హౌసింగ్ ఇల్లు నిర్మించుకునే వారికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.24 వేలు పొదుపు గ్రూపులో ఉన్న మహిళలకు రూ.35 వేల రూపాయలు లోను తోడ్పాటు ఇప్పించడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలిపారు. జేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ దిలీప్‌కుమార్, హౌసింగ్ ఎఇ, ఉపాధి హామీసిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, సచివాల సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










