ఫొటో : పనులు పరిశీలిస్తున్న అధికారులు
ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలన
ప్రజాశక్తి-సంగం : సంగంలోని తిరమనతిప్ప వద్ద ఉన్న జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ పీడీ నరసింహారావు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల నాణ్యతను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యత లేకుండా కట్టిన బేస్మెంట్‌లను దగ్గరుండి తొలగించారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు జరపాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. లబ్ధిదారులు తమ ఇళ్లను నిత్యం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏ ఈ కరీముల్లా,సిబ్బంది పాల్గొన్నారు.










