Feb 08,2023 22:15

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి చిరంజీవి

ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలి
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : జగనన్న లే అవుట్లను ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలు, త్వరితగతిన ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆత్మకూరు స్పెషల్‌ ఆఫీసర్‌ జిల్లా ప్రజా పరిషత్‌, జిల్లా పంచాయతీ అధికారి బి.చిరంజీవి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ అదేశాల మేరకు మండలంలోని జరిగిన ఈ-క్రాఫ్ట్‌ను పరిశీలించారు. అనంతరం మండలంలోని బట్టేపాడు సచివాలయంలో తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఆధార్‌ స్పెషల్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను పరిశీలించారు. ఆధార్‌ అప్‌డేట్‌ను స్వయంగా పరిశీలించారు.
సమీపంలో నుడా అధ్వర్యంలో జగనన్న లే అవుట్లను పరిశీలించారు. తదుపరి ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న లే అవుట్లను కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలు త్వరితగతిన నిర్మాణ పనులను చేపట్టాలని ఇంజనీరింగ్‌ సహాయకులను ఆదేశించారు. హౌస్‌ట్యాక్స్‌ త్వరగా వసూలు చేసి పూర్తి చేయాలని, పారిశుధ్య నిర్వహణ అన్ని గ్రామాల్లో సక్రమంగా నిర్వహించాలని దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ సహాయకులు పాల్గొన్నారు.