Jun 06,2023 21:28

ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీష

రాజంపేట రూరల్‌ : ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. మంగళవారం మండలంలోని రామచంద్రాపురం, తొగురుపే టలలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో నెలకొన్న సమస్యలను పరిశీలించి తీసుకో వాల్సిన చర్యల నిమిత్తం అధికారులతో కలిసి కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యటిం చారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులకు కేటాయించిన ఇండ్ల స్థలాల లేఅవుట్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. మొత్తం ఎంతమందికి ఎన్ని ఎకరాలలో ఎన్ని ప్లాట్లు కేటాయిచారని తహశీల్దార్‌ను ప్రశ్నించగా 10 ఎకరాల్లో దాదాపు 120 మందికి ప్లాట్లు కేటాయించమని, ఇందులో రామచంద్రాపురం వారికి 40 తొగురుపేట వాళ్లకు 80 ప్లాట్లు ఇచ్చినట్లు తహశీల్దార్‌ తెలిపారు. ఆ స్థలంలో ఇండ్లను నిర్మించుకోవడంలో గల సమస్యలను, ఇబ్బందులపై గ్రామస్తులతో కలెక్టర్‌ ఆరా తీశారు. గ్రామస్తులు స్పందిస్తూ. ఇండ్ల కొరకు తమ కేటాయించిన స్థలం కొండ పైభాగంలో కొంత, క్రింది ప్రాంతంలో ఎటువాలుగా ఉందని దానిని లెవలింగ్‌ చేయాల్సి ఉందని, రహదారులు, నీటి వసతి ఏర్పాటు చేయాలని, అప్పటివరకు ఇండ్లు నిర్మాణం చేపట్టలేమని గ్రామస్తులు కలెక్టరుకు వివరించారు. ఇండ్ల స్థలాన్ని లెవెలింగ్‌ చేసి అభివద్ధి చేయడానికి గల అవకాశాలపై పంచాయితీ రాజ్‌ అధికారులతో కలెక్టర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. కొండ పైభాగంలో కేటాయించిన స్థలం లెవెలింగ్‌ బాగానే ఉందని, దానిని మరికొంత అభివద్ధి చేసి దారి ఏర్పాటు చేయాలని చెప్పారు. అక్కడే లే ఔట్‌ను అనుకోని ఉన్న స్థలం ఎవరిది, ఎంత ఉందని కలెక్టర్‌ అడుగగా.. అది పట్టభూమి 2.50 ఎకరాలు తొగురుపేటకు చెందిన సుధాకర్‌ కుటుంబానికి చెందినదని అధికారులు గ్రామస్తులు కలెక్టర్కు వివరించారు. సదరు వ్యక్తి అంగీకరిస్తే ఆ భూమిని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని, లేదా స్థలమే కావాలంటే మరొక ప్రదేశంలో అతనికి స్థలం కేటాయించడం జరుగుతుందని.. కొండ కింద ఏటువాలు ప్రాంతంలో ఇండ్లను కేటాయించిన వారందరికీ అక్కడ ప్లాట్లు కేటాయించుటకు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తితో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. రామచంద్రాపురంలో కొందరు తమకు వేరే ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టర్కు విన్నవించారు. తొగురుపేట రామచంద్రపురం లకు త్రాగునీటి సౌకర్యం కావాలని ఇందుకు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మించాలని, స్మశానం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి, నేటి వసతి కల్పించి స్మశానాన్ని అభివ ద్ధి చేయాలని, ఆయా గ్రామంలో ఉన్న రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని రైతులు, గ్రామస్థులు కోరారు. వివిధ అంశాలలో గ్రామస్తులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్‌ సావధానంగా ఆలకించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని తొగురుపేట, రామచంద్రపురం ప్రజలను కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో రాజంపేట ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి, హౌసింగ్‌ పీడీ శివయ్య, పిఆర్‌, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు కెజెఎస్‌ చంద్రారెడ్డి, ప్రసన్న కుమార్‌, వివిధ శాఖల అధికారులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.