Feb 17,2022 08:16
ఇదీ ఉత్తరప్రదేశ్‌ పరిస్థితి!

న్యూఢిల్లీ : బిజెపికి ఓటేయకపోతే ఉత్తరప్రదేశ్‌ మరో జమ్ముకాశ్మీర్‌ లేదా పశ్చిమ బెంగాల్‌ లేదా కేరళలాగా మారిపోతుందంటూ యుపి ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు బిజెపిని అపహాస్యం పాల్జేసిన సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్‌, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌, ఆర్‌బిఐ, సిఎంఐఇ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారిక గణాంకాల ప్రకారమే యుపి కంటే ఈ మూడు రాష్ట్రాలు ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. 2019-20 వ్యవధిలో వివిధ అంశాల్లో ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, జమ్ముకాశ్మీర్‌ పరిస్థితి ఈ విధంగా ఉంది.
* శిశుమరణాలు : అతి తక్కువ మరణాలతో దేశంలో కేరళ మూడవ స్థానంలో ఉండగా, జమ్ముకాశ్మీర్‌ ఏడవ స్థానం, పశ్చిమ బెంగాల్‌ 12వ స్థానంలో నిలిచాయి. అన్నిటికంటే అధ్వానంగా యుపి 35వ స్థానంలోఉంది.
* గర్భిణీ మహిళల్లో రక్తహీనత : రక్తహీనతను నివారించడంలో కేరళ దేశంలో నాల్గవ స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌ 16వ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌ 32, జమ్ముకాశ్మీర్‌ 12వ స్థానంలో ఉంది.
* ఆరోగ్య బీమా కలిగిన కుటుంబాలు : ఈ విషయంలో కేరళ 12వ స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌ 23, జమ్ముకాశ్మీర్‌ 35వ స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ 31వ స్థానంలో ఉంది.
* పోషకాహార లేమితో పిల్లలు బరువు తక్కువగా పుట్టడం : కేరళ ఏడవ స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌ 28, జమ్ముకాశ్మీర్‌ 10వ స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ 27వ స్థానంలో ఉంది
* ఎదుగుదల లేక గిడసబారుతున్న చిన్నారులు : కేరళ నాల్గవ స్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్‌ 25, జమ్ముకాశ్మీర్‌ 10వ స్థానంలో ఉఉన్నాయి.ఉత్తరప్రదేశ్‌ 34వ స్థానంలో ఉంది.
* బరువు, ఎత్తు తక్కువగా ఉన్న చిన్నారులు : ఆరోగ్య కరమైన చిన్నారుల్లో కేరళ13వ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌ 29, జమ్ముకాశ్మీర్‌ 24వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌ 17వ స్థానంలో ఉంది.
* కనీస ప్రావీణ్యం ఉన్న 8వ తరగతి విద్యార్థులు : విద్యార్థుల ప్రావీణ్య విషయంలో కేరళ 2వ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌ 20, జమ్ముకాశ్మీర్‌36వ స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌ 26వ స్థానంలో ఉంది.
* మాధ్యమికోన్నత విద్య: కేరళ మూడవ స్థానంలో ఉండగా పశ్చిమ బెంగాల్‌ 22, జమ్ముకాశ్మీర్‌ 27వ స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ 24వ స్థానంలో ఉంది.
* నీటి కులాయిలున్న గ్రామీణ జనాభా : నీటి కులాయిల్లో కేరళ 26వ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌ 23, జమ్ముకాశ్మీర్‌16వ స్థానంలో ఉన్నాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్‌ 36వ స్థానంలో ఉంది.
* వంట గ్యాస్‌ వాడుతున్న కుటుంబాలు : కుటుంబాలకు వంట గ్యాస్‌ స్థానంలో కేరళ 16వ స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌ 30, జమ్ముకాశ్మీర్‌ 18వ స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ 25వ స్థానంలో ఉంది.
* తలసరి నికర రాష్ట్ర ఉత్పత్తి : కేరళ తొమ్మిదో స్థానంలో నిలవగా పశ్చిమ బెంగాల్‌ 22, జమ్ముకాశ్మీర్‌ 25వ స్థానంలో ఉన్నాయి.ఉత్తరప్రదేశ్‌ 31వ స్థానంలో ఉంది.
* కార్మిక భాగస్వామ్యంలో మహిళు, పురుష కార్మికుల నిష్పత్తి : కేరళ 10వ స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌ 27, జమ్ముకాశ్మీర్‌ 9వ స్థానంలో ఉన్నాయి.ఉత్తరప్రదేశ్‌ 35వ స్థానంలో ఉంది.