విద్యార్థులు పూలు చల్లుతున్న దృశ్యం
ఇది మీకు తగునా...
స్వాగతం పేరుతో విద్యార్థులకు శిక్ష
నెల్లూరు:నగరంలోని శ్రీ కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా విజయం సాధించి నగరానికి విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలల అధ్యాపకులు తమ డైరెక్టర్‌కు స్వాగతం పలికి గుర్తింపు పొందేందుకు విద్యార్థులను గంటల కొద్ది రోడ్లపై నిలుచునబెట్టారు. శుక్రవారం సాయంత్రం 5.50 గంటల నుంచి 7 గంటల వరకు ఇంటర్ చదువుతున్న విద్యార్ధులను రోడ్డుపై నిలబెట్టడం పలు విమర్శలకు దారి తీసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్ధులను గంటల కొద్ది రోడ్డుపై నిలబెట్టడం ఎంత వరకు న్యాయమని విద్యార్ధుల తల్లిదండ్రులు పలువురు అసహనం వ్యక్తం చేశారు.










