ప్రజాశక్తి -కందుకూరు :ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి టిడిపి సిద్ధంగా ఉందని, ఈ సారి ఎన్నికల్లో జెంగా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్నిపట్టణంలోని 19వ వార్డు గోకరాజు పాలెంలో సోమవారం నిర్వహించారు. ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు ఇతర నాయకులు వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. వార్డులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలు ఎప్పుడో గ్రహించారన్నారు. వార్డు అధ్యక్షుడు ఉన్నం కష్ణమోహన్, వార్డు నాయకులు దండే ఏడుకొండలు, గంటా శ్రీకాంత్, షేక్ మహభాష, మాజీ కౌన్సిలర్ షేక్ రహమతుల్లా భాష, ఆకుల శ్రీనివాసులు, షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ సుల్తాన్, రాష్ట్ర కమిటీ నాయకులు చిలకపాటి మధు చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, కూనం నరేంద్ర, నెల్లూరు పార్లమెంట్ కమిటీ నాయకులు గోచిపాతల మోషే ఉన్నారు.










