Feb 03,2023 22:27

ఫొటో : మాట్లాడుతున్న టిడిపి కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మాలేపాటి సుబ్బనాయుడు

ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణ 38వ వార్డులో శుక్రవారం టిడిపి కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ''ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి'' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వార్డులోని సమస్యలపై దృష్టి సారించారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్న చేసిందేమీ లేదని రోడ్లు అస్తవ్యస్తం చేసి ఇసుక, గ్రావెల్‌ రకరకాలుగా దోచుకోవటంతో సరిపోయిందని, కనీసం రోడ్డు వేసిన దాఖలాలు లేవన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీధి దీపాలు కూడా వేసిన పరిస్థితి లేదని తెలిపారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్‌ పాలన రావాలని నినాదాలు చేశారు.
వార్డులోని చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ, చిరు వ్యాపారస్తుల అంగడి వద్ద సరదాగా మాట్లాడుతూ వీధినంత సందడిమయం చేశారు. తీవ్ర స్థాయిలో ఉన్న డ్రెయినేజీ సమస్యపై ప్రజలు సుబ్బానాయుడు దృష్టికి తీసుకురాగా, వాటిని ఉద్దేశించి సుబ్బానాయుడు మాట్లాడుతూ అన్నపు గుంటను గతంలో పరిశీలించిట్లు తెలిపారు. ఆ సమస్యపై మున్సిపల్‌ అధికారులకు ఎంత తెలిపినఇప్పటికీ అధికారులు గానీ, ఎంఎల్‌ఎ గానీ చొరవ తీసుకోకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, రాష్ట్ర లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, రాష్ట్ర ఐటిడిపి కార్యదర్శి కంచర్ల రఘు, యూనిట్‌ ఇన్‌చార్జ్‌, పట్టణ బిసిసెల్‌ ప్రధాన కార్యదర్శి వేటూరి శివ, వార్డు అధ్యక్షులు బెజవాడ రవీంద్ర, జిల్లా బిసి సెల్‌ ఉపాధ్యక్షులు మల్లి రమణయ్య, 31వ వార్డు పార్టీ ఇన్‌ఛార్జ్‌ మంచాల ప్రసాద్‌, రాష్ట్ర టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దార్ల శివకుమార్‌, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పూడిపర్తి మురళి, నెల్లూరు పార్లమెంటు యువత అధికార ప్రతినిధి జంపాని వంశీ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.