'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి'
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణం 39వ వార్డులో ఆదివారం తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో 'ఇదేమి ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా ఆదివారం 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌ఛార్జ్‌తో కలిసి పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వ దోపిడీ, చేతగానీ పరిపాలన, టిడిపి విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పాలనలో వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రజల సొమ్మును దోచుకుని తింటున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగానెరవేర్చలేదన్నారు. సంక్షేమం మాటున భారీ అవినీతి జరుగుతోందన్నారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడుని గెలిపించుకోవాలని మాలేపాటి సుబ్బానాయుడు కోరారు. రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, పట్టణ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ద్రోణాదుల వాసంతి, పోతుగంటి శ్రీకాంత్, వార్డు అధ్యక్షులు తోట కళ్యాణ్, బూసి రాజేష్, కె మనోజ్, ఖాదర్ అలీ, మహిళా నేతలు శ్రీలక్ష్మి, కుల్లురు అశ్విని, షేక్ మున్ని, జయంపు లీలావతి, లక్ష్మి, జూలీ అరుణ, షేక్ బిబిజన్, బూసి శేషమ్మ, నాగూర్, శివ, నలమోతు శ్రీనివాసులు తదితరులున్నారు.










