మాట్లాడుతున్న టిడిపి నాయకులు దినేష్‌రెడ్డి
ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి
కొడవలూరు:తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో కొడవలూరు మండలం చలివేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలు అడిగి ఆ సమస్యల పరిష్కరించేందుకు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గెలిపించుకుంటే ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో సమస్యలపై ప్రజలను అడిగితే సైడ్ డ్రమ్స్ లేవని చెబుతున్నారు గతంలో ఈ గ్రామాన్ని పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అభివద్ధి చేశారని తెలిపారు. 2014 నుంచి 19 దాకా దాదాపు ఈ గ్రామంలో 90 శాతం సిసి రోడ్లు ఎల్‌ఈడి లైట్ నీటి కుళాయిలు వాటర్ కలెక్షన్స్ కట్టించడం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచి రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని పెడతారని, కనీవిని ఎరగని రీతిలో ఉద్యోగులు రాష్ట్రపతిని కలిసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని గవర్నరుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేంద్ర, చెక్క మదన్ మోహన్ రావు, నాశన ప్రసాద్, చెముకుల చైతన్య కష్ణ, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










