Nov 15,2023 20:19

సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - ఆదోని
'గడపగడపకు'లో స్థానికులకు ఇచ్చిన మాటను నిలుపుకోవడమే విధిగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని 41వ వార్డు ఇన్‌ఛార్జీ దుర్గప్ప అధ్యక్షతన కొత్తగా సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు రాజకీయం, రాజ్యాధికారం ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదన్నారు. మురుగునీటి కాలువలపై అక్రమంగా కట్టడాలు నిర్మించుకోవడం, అక్కడికి వెళ్లడానికి కూడా వీల్లేకుండా స్థలాలను ఆక్రమించుకుని నివసించడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలు ఎవరు నిర్మించినా సహించేది లేదని, చివరకు వైసిపి వారైనా సహించనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ కామాక్షి బ్రహ్మయ్య ఉన్నారు.