Apr 01,2023 20:28

లబ్ధిదారులకు చెక్‌ అందజేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి

మదనపల్లె అర్బన్‌ : జగనన్న మాటలు చెప్పే వ్యక్తి కాదనీ, చేతల్లో చూపించేవి వ్యక్తని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని, జడ్పీ హైస్కూల్‌, బైపాస్‌ రోడ్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో వైయస్సార్‌ మూడో విడత ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొని జగనన్న మాట చెప్పాడంటే కచ్చితంగా చేసి తీరుతాడని ఇందుకు నిదర్శనం ఈ నాలుగేళ్ల పాలననే ఉదాహరణలని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కేవలం మాటలు చెప్పే వ్యక్తిని ఆయన పరిపాలనకు ప్రస్తుత నాలుగు సంవత్సరాల జగనన్న పరిపాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని ఇది ప్రజలు గుర్తించారన్నారు. శాసనసభ్యులు నవాజ్‌బాష మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ పథకాలైన అమ్మ ఒడి ఆసరా చేయూత ఫీజు రీయంబర్స్మెంట్‌ యూనిఫామ్‌, వంటి కార్యక్రమాలను చేపట్టడం ప్రజలందరూ చూశారన్నారు. కార్యక్రమంలో ఎపిఎండిసి చైర్‌పర్సన్‌ జి.సమీమస్లాం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజరెడ్డి, వైస్‌ చైర్మన్లు జింక వెంకటాచలపతి, నూర్‌ ఆజాం, ఎంపిపి రెడ్డమ్మ, ఎంపిడిఒ తాజ్‌ మస్రోర్‌, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు ఉదరు కుమార్‌, వెలుగు చంద్ర, ప్రజలు పాల్గొన్నారు.