May 09,2023 20:42

మాట్లాడుతున్న డాక్టర్‌

మాట్లాడుతున్న డాక్టర్‌
'ఈబస్‌' టెక్నాలజీతో కేన్సర్‌ నిర్ధారణ
నెల్లూరు:నగరంలోని మెడికవర్‌ హాస్పిటల్లో ''ఈబస్‌ ''విధానం ద్వారా మొట్టమొదటిసారిగా 57 సంవత్సరాల వద్ధుడికి లంగ్‌ క్యేన్సర్‌ ను స్పాట్లోనే నిర్ధారించి ఉచితంగా చికిత్స చేస్తున్నట్టు ఇంటర్వెన్షనల్‌ పలమనాలజిస్ట్‌ డాక్టర్‌ కాటంరెడ్డి కౌశిక్‌ రెడ్డి తెలిపారు. విదేశాల్లో ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీలో శిక్షణ పొంది స్పాట్‌ లోనే నిర్ధారించినట్లు పేర్కొన్నారు. స్థానిక మెడికవర్‌ వైద్యశాలల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరానికి సంబంధించిన పనివిధానాన్ని వివరించారు. గతంలో క్యేన్సర్‌ లక్షణాలు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే రిపోర్ట్‌ రావడానికి 10 నుంచి 12 రోజులు సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం తమ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ''ఈబస్‌'' అనే అధునాతన టెక్నాలజీ ద్వారా కొద్దీ సమయంలోనే వ్యాధిని నిర్ధారించడం సాధ్యమౌతుందన్నారు. ఇటీవల తన హస్పిటల్‌ లో నగరానికి చెందిన ఓ వద్ధుడు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ చికిత్సల నిమిత్తం వచ్చారని, ''ఈబస్‌'' అనే అధునాతన టెక్నాలజీ ద్వారా పరీక్షలు నిర్వహించగా అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్నట్లు అతి తక్కువ సమయంలోనే గుర్తించామన్నారు
. మెడికవర్‌ హాస్పిటల్‌ సెంట్రర్‌ హెడ్‌ డాక్టర్‌ గణేష్‌ మాట్లాడుతూ నెల్లూరు, కడప, ఒంగోలు,తిరుపతి జిల్లాలలో ఉండే ప్రజలు వ్యాధి నిర్ధారణ చికిత్స కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సి అవసరం లేదన్నారు. అన్ని రకాల వైద్య సేవలను మెడికవర్‌ హాస్పిటల్‌ లో అందిస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్‌ కౌశిక్‌ రెడ్డి ప్రతిరోజు ఓపి చూస్తారని చెప్పారు. అవసరం ఉన్నవారు డాక్టర్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ మహేశ్వర రెడ్డి, పల్మ నాలజిస్ట్‌ డాక్టర్‌ సుస్మితా రెడ్డి, అనస్తీషియా డాక్టర్‌ రంగనాద్‌, సిబ్బందికి, తనను ప్రోత్సహిస్తూ సహకరించిన మెడికవర్‌ మేనేజ్మెంట్‌ వారికి డాక్టర్‌ కౌశిక్‌ రెడ్డి కతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.