Dec 15,2022 21:52

ఎంపికైన జల్లా జట్ల సభ్యులు, తదితరులు

కదిరి టౌన్‌ : పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో హ్యాండ్‌ బాల్‌ అండర్‌ - 14 జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు మాస్టర్‌ షాకీర్‌ తెలిపారు. ప్రతిభ ఆధారంగా సెలక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28, 30న కదిరి పట్టణంలో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోటీలకు ఎంపికైన జట్టు సభ్యుల వివరాలను ఆయన వెల్లడించారు.
బాలురజట్టు: జశ్వంత్‌, విశ్వనాథ్‌, సాయి కుమార్‌, వేణుగోపాల్‌, వినరు, విశ్వనాథ్‌, రవి, నిరంజన్‌, విశాల్‌ రెడ్డి, జస్వంత్‌, అహమ్మద్‌ తఫలాన్‌, బన్నీ, గంగాధర్‌, సాయి సందేశ్‌, సాదిక్‌, సోమేశ్‌ కుమార్‌.
బాలికల జట్టు : అర్చన, పవిత్ర, రాజహంసని, నందిని, సింధూజ, రాధిక, లిఖిత, కల్పన, కావ్య, ఉమానరు, మెహన్‌ తాజ్‌, జ్యోష్ణ, హర్షిని, సమీరా జాస్మిన్‌, లక్ష్మీ ప్రసన్న, రీనా అప్సన.
వీరు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ గేమ్‌ సెక్రటరీ అంజన్న, పీడీలు దనమయ్య, బయరెడ్డి, హరిప్రసాద్‌, షఫీ, లష్కర్‌ నాయక్‌, బాబా ఫక్రుద్దీన్‌, రెడ్డప్ప, హరూన్‌, అది నారాయణ, సందీప్‌, ఆనంద్‌ రెడ్డి, శివకుమార్‌, మేనేజర్‌, కోచ్‌లతో పాటు పాఠశాల హెడ్‌ మాస్టర్‌ శాంతమ్మ, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌కె.వలి తదితరులు పాల్గొన్నారు.