హైదరాబాద్ : త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా శనివారం ఆమె తెలిపారు. 'హుజూరాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా?, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా?, దళితులకు 3 ఎకరాల భూమి వస్తుందా?' అని ప్రశ్నించారు. ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు తాము కూడా పోటీచేస్తామని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం మాత్రమేనంటూ ఆమె అభిప్రాయపడ్డారు.










