Aug 01,2022 23:11

ప్రజాశక్తి-నందిగామ: లోన్‌ యాప్‌ రికవరీ ఏజెంట్ల వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన జాస్తి హరిత వర్షినికి సంబంధించిన కేసులో ముగ్గురు మేనేజర్లను, నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు డిసిపి మేరీ ప్రశాంతి వెల్లడించారు. సోమవారం నందిగామ పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రికవరీ ఏజెంట్ల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జాస్తి హర్షిత కేసులో నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. ఏజెంట్‌లుగా నియామకాలు జరిపేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత పోలీస్‌స్టేషన్లో అతని నేర చరిత్రపై ఆరా తీయాలని బ్యాంకులకు సూచించారు. ఈ సమావేశంలో ఏసీపి నాగేశ్వర్‌రెడ్డి, సిఐ కనకారావు సిబ్బంది పాల్గొన్నారు.