ప్రజాశక్తి-పెనుకొండ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీ రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు జిల్లా కార్యదర్శి బి.నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని సివిల్ సప్లరు స్టాక్ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పెరిగిన కూలి రేట్ల జీఓను వెంటనే విడుదల చేయాలని, అరియర్స్ చెల్లించాలని, పిఎఫ్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, కొత్తవారి పేర్లను నమోదు చేయాలని, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లరు హమాలీ యూనియన్ నాయకులు బాబు, తిప్పన్న, రఫీక్, ఓబులేసు, హనుమంతు, సలీమ్ పాల్గొన్నారు.
గోరంట్ల : మండలంలో సివిల్ సప్లరు గోడౌన్‌లో పనిచేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గోడౌన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హమాలీలు మాట్లాడుతూ పెరిగిన కూలి రేట్లు వెంటనే అమలు చేయాలని, పెరిగిన కూలి రేట్లకు అరియర్స్ చెల్లించాలని, పిఎఫ్ సమస్యను పరిష్కరించాలని, కొత్తవారికి పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం హమాలీల సమస్యలు పరిష్కరించి పెంచిన కూలి రేట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి గంగాధర్, బాబావలి, అశోక్, వాసు, నాగేష్, నర్సింహులు, ముస్తఫా, అనిల్, రమేష్ పాల్గొన్నారు.
పెనుకొండలో ఆందోళన చేస్తున్న హమాలీలు










