Aug 11,2022 22:58

 సిఐటియు జిల్లా ఉపాధ్యాక్షురాలు ఎన్‌సీహెచ్‌ సుప్రజ
ప్రజాశక్తి-మైలవరం

స్వాతంత్య్ర ఉద్య మ స్పూర్తితో కార్మికుల హక్కుల కోసం కార్మికులంతా పోరాటం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్‌సీహెచ్‌ సుప్రజ పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ మండల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈకార్యక్రమానికి హజరైన ఆమె మాట్లాడుతూ 75 ఏళ్ళ స్వాతంత్య్ర వేడుకలు వాడవాడలా జరుగుతున్నాయని, కార్మికులంతా వేడుకల్లో పాల్గొనాలన్నారు. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనదాఖాలాలు లేవన్నారు. వేలాది మంది కార్మికులు, నాయకులు పోరాటాల ఫలితమే భారత దేశ స్వాతంత్య్రం అన్నారు. రాజ్యంగం కల్పించిన ప్రాధమిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి సీహెచ్‌ సుధాకర్‌, మండల కమిటీ సభ్యురాలు పత్తిపాటి జ్వోతి, టి వేముల వెంకయ్య, నాగేశ్వరరావు, గంటా సాంబయ్య, విజరు, సురేష్‌, శ్రీను, స్వర్ణలత, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.