ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్
బాకు(అజర్‌బైజాన్): ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ పోటీల్లో హ్రిదరు హజారికా, మహిళల విభాగంలో నాన్సే రజిత పతకాలను సాధించారు. శుక్రవారం జరిగిన పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో హ్రిదరు 251.9పాయింట్లతో, నాన్సే 253.3పాయింట్లతో రజిత పతకాలు గెలిచారు. ఇక 10మీ. అలాగే రిథమ్ సంఘ్వాన్ 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. రిథమ్ సాంఘ్వాన్‌కు సీనియర్స్ విభాగంలో ఇదే తొలి పతకం. దీంతో షూటింగ్ పోటీల్లో భారత్ 4 పతకాలు సాధించినట్లైంది. అంతకుముందు మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జ్యోత్ సింగ్‌ాటిఎస్ దివ్య జంట స్వర్ణ పతకాన్ని సాధించారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో హ్రిదరు 630.3పాయింట్లతో తొమ్మిదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరాడు. ఈ విభాగంలో హంగేరీకి చెందిన జలన్ పెక్లర్(252.4) స్వర్ణ, చైనాకు చెందిన సెంగ్ లిహావో కాంస్య పతకాలు గెలిచారు. ఇక మహిళల విభాగంలో నాన్సే అర్హత రౌండ్‌లో 631.6పాయింట్లతో 8వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరగా.. ఫైనల్లో హన్‌ాజిాహు(254.0పాయింట్లు), హంగ్ యుటింగ్(232.5 పాయింట్లు) స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.










