Jun 23,2022 22:23

రన్‌ను ప్రారంభిస్తున్న కార్పొరేటర్‌ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: కుల, మత, వయసులకు అతీతంగా అందరూ క్రీడల్లో పాల్గొనాలనేదే ఒలంపిక్‌ డే రన్‌ ముఖ్య ఉద్దేశ్యమని 52వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) తెలిపారు. ఒలంపిక్‌ డే సందర్భంగా గురువారం కొత్తపేట ఎస్‌కెపివివి హిందూ హైస్కూల్‌ క్రీడాకారులు ఒలంపిక్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ క్రీడలను, క్రీడాకారులను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డివిజన్‌లో క్రీడల అభివద్ధికి కృషిచేస్తానని అన్నారు. రన్‌ పాఠశాల నుంచి ప్రారంభమై జెండా చెట్టు, పంజా సెంటర్‌, చేపల మార్కెట్‌, కోమల విలాస్‌ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి.బ్రహ్మేశ్వరరావు, ఎం.వి.సత్యప్రసాద్‌, బాక్సింగ్‌ కోచ్‌ కె.మోజేష్‌ పాల్గొన్నారు.