May 20,2023 22:08

ఫొటో : హెచ్‌ఎంలకు పుస్తకాలు అందజేస్తున్న ఎంఇఒ

హెచ్‌ఎంలకు పుస్తకాలు అందజేసిన
ప్రజాశక్తి-ఉదయగిరి : సెలవుల్లో సరదాగా అనే పుస్తకాలను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎంఇఒ షేక్‌ మస్తాన్‌ వలీ అందజేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ 3,4,5 తరగతులు ఉన్న ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సహోపాధ్యాయులు సమ్మర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించిన సెలవుల్లో సరదాగా పుస్తకాలు తీసుకుని వెళ్లి ఆయా తరగతుల విద్యార్థులకు అందజేసి తగిన మార్గదర్శనం చేయమని తెలిపారు. పాఠశాల పునప్రారంభం రోజున విద్యార్థులు చేసిన కృత్యాలను ఉపాధ్యాయులు పరిశీలించి సరి చూడవలసి ఉంటుందన్నారు.
పాఠశాల లేదా తరగతి వారీగా వాట్సాప్‌ ఏర్పాటు చేసిన ఆ గ్రూపు ద్వారా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ప్రధానోపాధ్యాయులు చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో రక్తహీనత, ఐరన్‌ లోపం వంటి సమస్యలను నిర్మూలించి పౌష్టికఆహారం అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలో పంపిణీ చేస్తున్న రాగి జావకు సంబంధించిన స్టీలు గ్లాసులను అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు. మిగిలిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా మండల కార్యాలయానికి వచ్చివున్న గ్లాసులను తీసుకువెళ్లనన్నారు. కార్యక్రమంలో ఎంఇఒ కార్యాలయ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.