Jan 08,2023 21:53

మాట్లాడుతున్న ఎంఎల్‌సి విటపు బాలసుబ్రమణ్యం

ప్రజాశక్తి -మర్రిపాడు : . సోమిశిల హైలెవల్‌ కెనాల్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసి మెట్ట ప్రాంతాలకు సాగు, త్రాగు నీరు అందించాలని ఎంఎల్‌సి విటపు బాలసుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు. మర్రిపాడులో ఆదివారం అఖిలపక్ష రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎంఎల్‌ఎసి విఠపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని మాట్లాడారు. సోమశిల జలాశయంలో నీరు పుష్కలంగా ఉపయోగించుకునే పరిస్థితి లేదన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రెండో పంటను నిలిపివేశారన్నారు. దీంతో జలాశయంలో నీరు వృథాగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పూర్తి చేసినట్లయితే మెట్ట ప్రాంతాలకు సాగునీరందిం చవచ్చాన్నారు. తద్వారా పంటల సాగుకు అవకాశం ఏర్పడు తుందన్నారు. వర్షాకాలంలో జలాశ యంలో నీరు ఎక్కువ భాగం సముద్రం పాలవు తుందన్నారు. రాజకీ యాల కతీతంగా అందరు కలిసి హై లెవెల్‌ కెనాల్‌ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల్లో పంటలు పండక, ప్రజలకు కూలి పనులు లేక వలసలు పోతున్నా రన్నారు. మెట్ట భూములు సస్యశ్యామలం కావలంటే సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించెందుకు పరిశ్రమలు స్థాపించాలని, అందు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హై లెవెల్‌ కెనాల్‌ పనులు ప్రారం భించిందన్నారు. ఏళ్లు గడిచినా నిర్మాణ పనులు నత్త నడక న సాగుతున్నాయన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగలం పుల్లయ్య, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంట లక్ష్మిపతి, సిపిఎం మండల కార్యదర్శి రహంతుల్లా , వైసిపి మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, వైసీపీ మండల నాయకులు కోనంకి శ్రీనివాసులు నాయుడు, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్‌ అమర్నాథ్‌ రెడ్డి, ఐద్వా మండల కార్యదర్శి శ్యామలమ్మ అధ్యక్షురాలు మూలి ప్రమీల, జనసేన మండలా ధ్యక్షురాలు ఓ ప్రమీల, వ్యవసాయ సంఘం నాయ కులు గంగినేని తిరుపతినందవరం, రామా నాయుడు పల్లి సిపిఎం నాయకులు సుధాకర్‌ మహ మ్మద్‌ గౌస్‌ ఆరు మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు.