తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేసి, తహశీల్దార్ ప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బాబావలి మాట్లాడుతు హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హర్ష, కుమార్, భగత్, అభి, వినోద్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.










