హార్సిలీహిల్స్‌లో అవుట్ పోస్టు - వర్చువల్‌గా ప్రారంభించిన సిఎం జగన్
బి.కొత్తకోట: పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో పోలీసు అవుట్ పోస్టును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రయం చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని, ఇంతకుముందు జరగని రీతిలో పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో రిసెష్పనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, మదనపల్లి డిఎస్‌పి కేశప్ప, సిఐ శివాంజనేయులు, ఎస్‌ఐలు రామ్మోహన, సుకుమార్ పాల్గొన్నారు.










