Jun 15,2023 21:42

సిడిపిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

రైల్వేకోడూరు : అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.చంద్రశేఖర్‌ అన్నారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే, తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనం గా ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని, నేడు నాలుగేళ్లు అవుతున్న అమలు చేయలేదని విమర్శించారు. కనీస వేతనాలు చట్ట ప్రకారం రూ.26 వేలు ఇవ్వాల్సి ఉండగా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, 2018లో వర్కర్‌కి రూ.1500, ఆయాకి రూ.750, మినీ వర్కర్‌కు రూ.1200 పెంచుతున్నట్లు ప్రకటించి నేటికీ అమలు చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోషపూరిత వాగ్దానాలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సక్రంగా జీతాలు చెల్లించడం లేదని, ప్రతినెల ఐదవ తేదీలోగా జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2017 నుండి ఆరు సంవత్సరాల నుండి టిఎ, డిఎ చెల్లించలేదని తెలిపారు. అధికార పార్టీ రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు ఎన్‌.రమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.రాధాకుమారి, ఉపా ధ్యక్షులు పిసుధామణి, వనజ కుమారి, కోశాధికారి పద్మావతి, దుర్గా, శిరీష, నిర్మలా, సుజాత, ఇందిరా, కుమారి, కౌసల్య, మైథిలి, వాణి, స్వర్ణ, సునీత, శ్రీదేవి, మాధవి సుబ్బలక్ష్మి, రోజా, రెడ్డమ్మ, రాధా, మండల సిఐటియు కోశాధికారి హరిన ారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి.జాన్‌ ప్రసాద్‌ పాల్గొ న్నారు. అనంత రం సిడిపిఒ సౌభాగ్యమ్మకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
మదనపల్లె అర్బన్‌: అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు అరికట్టాలని పట్టణంలోని సిడిపిఒ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్‌ మదనపల్లె ప్రాజెక్టు అధ్యక్షులు డియర్‌ మధురవాణి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ నాయకులు వేధింపులు అరికట్టాలని, కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, బర్త్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ సమస్య అంగన్వాడీలకు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అంగన్వాడీలకు సరఫరా చేసే స్టాకు సరిపడా ఇవ్వాలని, తూకాలు సరిగా ఉండాలని, రిటైర్డ్‌ అంగన్వాడీ హెల్పర్లకు బెనిఫిట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సిడిపిఒ సుజాతకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పి.రాజేశ్వరి కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయచోటి టౌన్‌ : పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీల జీతాలు బిల్లులు ఈ నెల 25 లోపు ఇవ్వకపోతే నిరవధిక ధర్నా చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షులు వి.సిద్దమ్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి.భాగ్యలక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.ఫయాజ్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసి ప్రయివేటీకరణ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని తెలిపారు. బడ్జెట్‌ తగ్గించడం, జీతాల బిల్లులు సకాలంలో మంజూరు చేయకపోవడం, కొత్త కేంద్రాలు కేటాయించకపోవడం జరుగుతోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి ప్రాజెక్టులో ఐదు నెలలుగా సెంటరు అద్దెలు ఇవ్వకపోవడంతో భవన యజమానులు బయటకు గెంటివేస్తున్నా అధికారులకు, పాలకులకు చీమ కుట్టినట్లు లేదని వాపోయారు. రెండు నెలలు జీతాలు, మూడు నెలలు కూరగాయల, గ్యాస్‌ బిల్లులు ఇవ్వలేదన్నారు. దాదాపు 90 మందికి వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్రమైన అప్పులతో, తీవ్రమైన అవమాన భారంతో అల్లాడుతున్నారని వాపోయారు. ప్రతి నెలా సకాలంలో జీతాలు ఇవ్వాలని తెలిపారు. ధర్నా అనంతరం సిడిపిఒకు నిరవధిక ధర్నా నోటీసును అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ఖాజాబి,ó విజయ, నాగమణి, కవిత, అరుణ, తులసి, పద్మజ, జయ అంజలి, ఉమా శంకరమ్మ, జలజ ప్రవీణ, ఇందిర, శైలజ పాల్గొన్నారు.రైల్వేకోడూరు :