Jan 26,2023 21:51

కలెక్టరేట్‌ ఎదుట ట్రాక్టర్లతో నిరసన తెలుపుతున్న రైతు, వ్య.కా.స నాయకులు

రాయచోటి టౌన్‌ : ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం రాతపూర్వక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విస్మరించిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి. శ్రీనివాసులు, రైతు సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు కె నాగబసి రెడ్డి విమర్శించారు. కేంద్ర కమిటీల పిలుప ుమేరకు గురువారం స్థానిక పట్టణంలో ట్రాక్టర్ల ర్యాలీ సాయి థియేటర్‌ నుంచి బస్టాండ్‌ సర్కిల్‌ మీదుగా బంగ్లా ఠాణా మాసాపేట ద్వారా కలెక్టరే ట్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు . ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగం గా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాయచోటి లో రిపబ్లిక్‌ డే సంద ర్భంగా నిరసన తెలియజేశామని చెప్పారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి సి2ం50 శాతం ఫార్ములా ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ మద్దతు ధరలు రైతులకు అందేలా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వెంటనే తేవాలన్నారు. కేంద్ర ప్రభు త్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు చట్టబద్ధత లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు వ్యవసాయ నష్టా లతో అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు రుణమాఫీ చేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పంట రుణాలు ఎందుకు లేదని ప్రశ్నించారు. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని, వ్యవసాయ పంపుసెట్లు మీటర్లు బిగింపు ఆపాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరులైన రైతు కుటుం బాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పేర్కొన్నారు. రైతులపై బనాయించిన అక్రమ కేసులు రద్దు చేయాలన్నారు. జిల్లాలో రైతుల ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రైతు వ్యతిరేక జీఓల కాఫీలను దగ్ధం చేశారు. ఈ ఆందోళన పోరాటానికి సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్‌. చంద్రశేఖర్‌ ఎ. రామాంజులు , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి .మణి కెెవిపిఎస్‌ నాయకులు ఎస్‌. రామచంద్ర సంఘీభావం మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.