ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలు తప్ప మరోమార్గం కనిపించడం లేదని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 31న హిందూపురం నుంచి ప్రారంభమైన జీపుజాతా శనివారం రాత్రి ప్రొద్దుటూరుకు చేరుకుంది. విజయకుమార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. తాను సిఎం అయిన వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీలిచ్చి గద్దెనెక్కిన వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం అన్నారు. 11పిఆర్‌సి ప్రకారం జీతాలు పెంచలేదన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఔట్‌సోర్సింగ్ విధానంతో కార్మికుల పరిస్థితి పెనంలో నుంచి ి పొయ్యిలో పడినట్లయిందని వాపోయారు.. సంక్షేమ పథకాలు అందడంలేదని, ఇఎస్‌ఐ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 8న విజయవాడలో మరో పోరాటానికి పిలుపునిస్తున్నామని చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టిన గతి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ను తెచ్చుకోవద్దని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాలరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు తెచ్చిన 279 జిఒకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఆ ఊసే మరిచిపోయారన్నారు. గడపగడప కార్యక్రమంలో 98 శాతం హామీలు అమలు చేశాం అని చెప్పడం పచ్చి అబద్దం అన్నారు. నాలుగేళ్లుగా కార్మికులను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తూనే ఉన్నారని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు రూ.6 వేలు భయంతో ఇచ్చిందే కానీ, వారిపై ప్రేమతో కాదని తెలిపారు. మనలో మనకు ప్రభుత్వం గొడవపెడుతోందన్నారు. ప్రధాని మోడీ కార్మిక చట్టాలను కాలరాసి తనకు అనుకూలంగా పార్లమెంట్‌లో బిల్లు పెడితే ఇందుకు వైసిపి , టిడిపి రెండూ మద్దతు ఇవ్వడంరెండు నాల్కుల ధోరణికి నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీలలోని 45వేల మంది కార్మికులతో పోరాటానికి సిధ్దం అవుతామని హెచ్చరించారు. కార్యక్రమానికి ముందు నాట్యమండలి కళాకారులు గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్యదర్శి నాగేంద్రబాబు, రాష్ట్రకమిటీ సభ్యులు ఎటిఎం నాగరాజు, గోపి, లకిëనారాయణ, ప్రజానాట్యమండలి కళాకారులు శ్రీనివాసులు, రామాంజి, పుల్లయ్య, కృష్ణవేణి, స్థానిక కార్మిక సంఘ నాయకులు సత్యనారాయణ, విజయకుమార్, సాల్మన్, చంటి, రాఘవ, రవణమ్మ, లకిëదేవి, నీతమ్మ పాల్గొన్నారు.










