Sep 26,2023 21:51

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న రైతుం సంఘం నాయకులు

హామీల అమలు కోసం పాదయాత్ర
ప్రజాశక్తి-ఉదయగిరి : హామీల అమలు కోసం 3వ తేదీన సిపిఎం చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య కోరారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని శకునాలపల్లి రైతు భరోసా కేంద్రంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదిరెడ్డిపల్లె రిజర్వాయర్‌ను పూర్తి చేసి తాగు, సాగునీరు ప్రజలకు అందించాలని ప్రజల రుణాలను రద్దు చేయాలన్నారు. మర్రిపూట్ల రిజర్వాయర్‌ నుండి చివరి ఆయకట్టుకు నీరు అందించి కాలువ మరమ్మతులు చేపట్టి కట్టమీద చెట్లు తొలగించి సిజెఎఫ్‌ఎస్‌ భూములకు సంబంధించి అసైన్డ్‌మెంట్‌గా మార్చి లబ్ధిదారులందరికీ పట్టాదారు పాసుబుక్‌ అందించాలని తెలిపారు.
దుత్తలూరు నుండి సీతారామపురం వరకు వేస్తున్న డబుల్‌ రోడ్‌ కింద భూములు, ఇల్లు నష్టపోతున్న రైతులు, ప్రజలు నష్టపోతున్న వారికి అధిక రెట్టింపు పద్ధతిలో నగదును ఇవ్యాలని ఉపాధి హాలు పనిదినాలను రెండు వందల రోజులకు పొడిగించి పెదిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ దక్షిణ కాలువ కొండ కింద గ్రామాలకు పొడిగించి సాగు, తాగు నీరు ఇవ్వాలన్నారు. శకునాలపల్లి పంచాయతీలోని ప్రజలకు ఫిల్టర్‌ నీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలను, ధరలను వెంటనే తగ్గించాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆర్‌బికెల ద్వారా పంటలను కొనుగోలు చేయాలని, ఉదయగిరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్నారు. మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టే ఈ పాదయాత్రను ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని భావితరాల భవిష్యత్తు కోసం నిరుద్యోగం వలసల నివారణకు ఫ్యాక్టరీలు నిర్మాణానికి చేపట్టే ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.