May 20,2023 21:40

ఘోరం!

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెచ్చుమీరడం ఆందోళన కలి గిస్తోంది. సోమవారం కొండాపురం మండలంలో తూఫాన్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢకొీన్న ఘటనలో ఏడుగురు మృతి చెంద డం, ఏడుగురు తీవ్ర గాయాల బారిన పడడం తెలిసిందే. అదేరోజు ఖాజీపేట మండలంలో ఇసుక తీసుకొస్తున్న వాహన డ్రైవర్‌ను మరో వాహనం ఢకొీనడంతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమా దాల బారిన పడిన పలు కుటుంబాలు రోడ్డును పడుతున్న ఉదంతా లను చూస్తూ ఉండి పోవాల్సివ స్తోంది. మన పొరుగున ఉన్న సింగ పూర్‌, మలేషియా, గల్ఫ్‌ దేశాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయ ంగా తగ్గుతున్న అను భవగతం చేసుకో వాల్సి ఉంది. జిల్లాలోని ఆర్‌ అండ్‌బి, ఆర్‌టిఓ డిపార్టుమెంట్‌ ఉన్నతాధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి కసరత్తు చేయాల్సి ఉంది. ప్రతియేటా రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కని పించడం లేదు. ఆర్‌టిఓ డిపార్టుమెంట్‌ ఉన్నతాధికారులు లారీలు, తూఫాన్‌, తదితర వాహనాలకు పర్మిట్లు మంజూరును కఠినతరం చేయాలి. వాహ నదారు నుంచి డ్రైవర్లకు సంబంధించిన అనుభవా లను తరుచుగా పరిశీలించాలి. వాహన తనిఖీలను ముమ్మరం చేయాలి. తగిన లైసెన్స్‌, అర్హత కలిగిన డ్రైవర్‌తో కూడిన వాహనా లను అనుమతి ఇవ్వాలి. ఆర్‌ అండ్‌బి యంత్రాంగం రహదారులపై విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సుధీర్ఘం గా వాహనం నడిపిన డ్రైవర్లు విశ్రమించడానిక అవకాశాలను కల్పిం చారు. రహదారులపై సూచికలు, స్పీడోమీటర్లను ఏర్పాటు చేయడం ద్వారా వేగాన్ని నియంత్రించే చర్యలు తీసు కోవాలి. అధిక వేగాన్ని సంతరించకున్న వాహనాన్ని సాంకేతిక పరిక రాల సహకారంతో గుర్తి ంచి హెచ్చరించాలి. హెచ్చరికలను పాటించని డ్రైవర్లకు వెంటనే జరి మానాలు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈయేడాది జూన్‌లో నూ తన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేప థ్యంలో స్కూల్‌ వ్యాన్ల తనిఖీలను సైతం ముమ్మరం చేయాలి. అనుమతులు లేని, కాలం తీరిన స్కూల్‌ వ్యాన్‌లకు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతులు మం జూరు చేయకూడదు. మంజూరు చేసిన అధికారులపై కఠినచర్యలు తీసుకున్నప్పుడే రోడ్డుప్రమాదాల నివారణ సాధ్యమయ్యే అవకాశాల ను పరిశీలించాలి.
- ప్రజాశక్తి - కడపప్రతినిధి