Mar 12,2023 22:10

కేక్‌ కట్‌ చేస్తున్న కదిరి నాయకులు

గోరంట్ల : పట్టణంలో వైసిపి కార్యాలయంలో వైసిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ లక్ష్మీనరసప్ప యాదవ్‌, టౌన్‌ కన్వీనర్‌ ధనారెడ్డి, సర్పంచులు సరోజ నాగే నాయక్‌, రామాంజనేయులు, గంగప్ప, ఆది, రాజారెడ్డి, చింతా రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : బడుగు బలహీన వర్గాల సంక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ అన్నారు. ఆదివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఏకైక సీఎం జగన్‌ అని చెప్పడానికి గర్వంగా ఉందని నాయకులు అన్నారు. రాజకీయంగా అన్ని వర్గాలకు సాధికారత తీసుకొచ్చారు. మహిళలకు నిజమైన సాధికారత దిశగా జగన్‌ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జబివుల్లా, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు లోకేష్‌ వాల్మీకి, మండల నాయకులు బసిరెడ్డి, పురుషోత్తం రెడ్డి, మార్కెట్‌ చాంద్‌బాష, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఉపేంద్ర రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్‌ మెంబర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో కుమ్మరవాండ్లపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. వైసిపి పట్టణ అధ్యక్షుడు బహుద్దిన్‌, నాయకులు ఈసందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి లింగాల లోకేశ్వర్‌ రెడ్డి, మాజీ సర్పంచి బత్తల వెంకటరమణతో పాటు నాయకులు పాల్గొన్నారు.