Aug 29,2023 23:01

పెనుగంచి ప్రోలులో తెలుగు తల్లి వేసధారణలో విద్యార్థిని

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : సిద్ధార్థనగర్‌లోని లిటిల్‌ బ్రైన్స్‌ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగు పాటలతో కూడిన సాం స్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఫణి ప్రసాద్‌ ముక్తేవి మాట్లాడారు.
గంపలగూడెం : మండలంలోని సత్యాలపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవం సంయుక్తంగా నిర్వహిం చినట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం ఎం.శాసనం రాజు తెలిపారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రప టానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిడుగు ప్రత్యేకతను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు , ర్యాలీ చేపట్టారు. ఎంపిడిఒ వైపి.రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో వీటి గుర్రం గోపాలరావు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడ : చిత్త రంజన్‌ గ్రేడ్‌-2 శాఖ గ్రంథాలయంలో తెలుగు భాష ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వక్తత్వ పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అథికారి పి.సంపత్‌ కుమార్‌ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
కంచికచర్ల : కంచికచర్ల శాఖా గ్రంథాలయంలో మంగళవారం గిడుగు రామమూర్తి పంతులు 160వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గిడుగు రామమూర్తి చిత్ర పటానికి గ్రంథాలయాధికారి రామచంద్రుడు పూలమాల వేసి నివాళులర్పించారు.
పెనుగంచిప్రోలు : స్ధానిక కె.వి.ఆర్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమా లను ప్రదర్శించారు. జానపద గేయాలు ఆకట్టుకోగా తెలుగు తల్లి వేషధారణలో కే విష్ణు ప్రియ రుద్రమదేవిగా ఎస్‌.భవాని ఆకర్షణగా నిలిచారు. వివిధ పొడుపు కథలు పాటలను విద్యార్థులు ఆకట్టు కునేలా వినిపించారు. తదుపరి తెలుగు ఉపాధ్యాయులు జూపూడి ప్రభుదాస్‌, బాణావతి రాములు నాయక్‌ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం చేశారు
తిరువూరు : తిరువూరు సుందరయ్య విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో తెలుగు భాషా ఔన్నత్యంపై విద్యార్థులకు వ్యాసరచన, పెద్దలకు కవితల పోటీలు నిర్వహించారు. అనంతరం తెలుగు రచయిత తోట ఉమా మహేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సెమినార్‌ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞానకేంద్రం కన్వీనర్‌ కడిమి పాపారావు, రిటైర్డ్‌ తెలుగు అధ్యాపకులు ముంగా జయ రాజు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు.
మైలవరం : స్థానిక లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో వ్యాసరచన, క్విజ్‌, వక్తత్వం పోటీలను నిర్వ హించి గెలుపొందిన వారికి బహుమతులు అంద జేశారు. ఈ కార్యక్రమంలోకళాశాల ప్రిన్సిపాల్‌ అప్పారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ హరినాథ్‌ రెడ్డి, శీలం ఉమామహేశ్వర్‌ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట: మండలంలోని గండ్రాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించి, పాఠశాల ప్రధానో పాధ్యాయులు వినుకొల్లు సత్యనారాయణ బహుమతులను అందజేశారు. పాఠశాల తెలుగు భాష ఉపాధ్యాయులు టి.సీతారామ రెడ్డిని సన్మానించారు.
నందిగామ : కెవిఆర్‌ కళాశాలలో తెలుగు భాష ఆవశ్యకత అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలకు సంబంధించిన విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రిన్సిపాల్‌ పి రాయప్ప అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు మాతభాష ప్రాధాన్యం పై వివిధ రూపకాలను ప్రదర్శించారు. వేదికపై జాతీయ క్రీడా దినోత్సవం కూడా నిర్వహించారు. కళాకారుల కార్యాలయంలో రంగం ప్రజా సంస్కతిక వేదిక బళ్లారి రాఘవ కళా సమితి సంయుక్త నిర్వహణలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. సెప్టెంబరు 9,10 తేదీలలో కర్నూల్‌ లో జరగనున్న రంగం ప్రథమ రాష్ట్ర మహాసభల కోసం తయారు చేయబడిన పోస్టర్‌ గోపాలకష్ణ సాయి నానయ్య లు కళాకారులంతా కలిసి ఆవిష్కరించారు.
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : శ్రీ విద్యాంజలి హైస్కూల్‌లో తెలుగు భాషపై విద్యార్థులకు వ్యాసరచన, కవితలు, చిట్టికథలు మొదలైన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పుప్పాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. విద్యాధరపురంలోని దళవాయి సుబ్బరామయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో వెన్నెల యూ ట్యూబ్‌ నిర్వాహకులు, తెలుగు పండితులు జూపూడి రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు తెలుగు పద్యం, పా, కవితలు, కథనంవంటివి ప్రదర్శించారు.
ఇబ్రహీంపట్నం : జన విజ్ఞాన వేదిక కొండపల్లి శాఖ ఆధ్వర్యంలో కొండపల్లిలోని మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయం (బాలురు)లో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్‌ కాటేపల్లి రామ్మోహన్రావు, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌ మహాభాష, డాక్టర్‌ మోహన్‌రావు మెమోరియల్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌ సర్జన్‌ డాక్టర్‌ మామిడి శీతారామారావు జెవివి జిల్లా ఉపాధ్యక్షులు పెట్ల కామేశ్వరరావు, పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (బాలికలు) విద్యార్థిని ఎస్‌ఎస్‌ శ్రావ్య ప్రదర్శించిన నిత్య ప్రదర్శన అతిథులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులందజేశారు. ఈ కార్యక్రమంలో జెవివి ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.సర్దార్‌ సాహెబ్‌ జెవివి కొండపల్లి శాఖ అధ్యక్షులు ఎస్‌ నాగరాజు, జెవివి ఉపాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మలత అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి విచ్చేశారు. విద్యార్థినులు భువనవిజయం రూపకం, ఇతర నత్యరీతులు, తెలుగు భాషా పద్యాలు, కళారూపాలు ప్రదర్శించారు.