Mar 16,2023 21:56

ఫొటో : శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి
ప్రజాశక్తి-ఉదయగిరి : మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళశాలలో శ్రీ పొట్టిశ్రీరాములు జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్‌ డాక్టర్‌ జి.కరుణ సాగర్‌ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరికీ ఆయన ఆదర్శప్రాయుడని ఆనాటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం మనకు ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని తెలిపారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థి కార్యకలాపాల కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ టి.గోపీకృష్ణ, అధ్యాపక, అధ్యాపకేతర, సహాయక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.