ప్రజాశక్తి-రాయచోటి టౌన్ : వర్గ పోరాటాలు విస్తతంగా నిర్మించడం ద్వారానే కార్మిక వర్గ రాజ్యాధికారం సాధ్యమని సిఐటియు జిల్లా ఉఫాధ్యక్షుడు పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులతో కలిసి ఆయన సిఐటియు జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ కార్మిక ఉద్యమ చరిత్రను సిఐటియు పాత్రను కార్మికులకు తెలియజేశారు. పీడిత, శ్రామిక జనాన్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తున్న సిఐటియు పోరాటాల స్పూర్తితో నయాఉదారవాద ఆర్థిక విధానాలు. మతతత్త్వ కార్పొరేట్ శక్తులను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వ్యవసాయ నల్లచట్టాలు రద్దుకొరకు కార్మిక కర్షక ఐక్యతతో కార్మిక వర్గ రాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ కార్యాలయంలో యుఇఇయు ప్రధాన కార్యదర్శి ఎ.వి.రమణ, యుఇసిడబ్ల్యూయు సెక్రటరీ కె.సుబ్రహ్మణ్యం రాజు, గజాల నాగేశ్వర గౌడ్ జెండావిష్కరణ చేశారు. మున్సిపల్ కార్యాలయాల ఆవరణ జెండావిష్కరణ కార్యక్రమంలో అంగన్వాడీ యానియన్ నాయకులు డి.విజయమ్మ, మున్సిపల్ యూనియన్ నాయకులు అగ్గిరామయ్య, రాంబాబు, వై.వెంకటరమణ, సిద్దయ్య, తిరుపాల్, మంగమ్మ, రాజమ్మ పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: స్థానిక సిఐటియు ఆఫీసు వద్ద ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. జెండాను జిల్లా కార్యదర్శి ప్రభాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధనకు సమస్యల పరిష్కారానికి వారి ఐక్యతా సాధనకే సిఐటియు ఏర్పటైందన్నారు. ప్రభుత్వాలను పెట్టుబడిదారులను ప్రయివేటు యజమానులను ఎదిరించి నిలబడిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు వెంకటేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జయరాం, టాటాఏస్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, నాగరాజు, పవన్, శ్రీరాములు, రమణ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్: సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు ఎం.ఈశ్వరమ్మ, శివరంజని, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీదేవి, కార్మికులు ప్రసాద్, రవిశంకర్, విఆర్‌ఎ సంఘం నాయకులు శంకర్, సుబ్రహ్మణ్యం, ప్రసాద్ పాల్గొన్నారు.










