రాయచోటి టౌన్ :
స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన తొలి మహిళా ఉపాధ్యా యురాలు సావిత్రిబాయి ఫూలే అని ఎస్‌ఎఫ్‌ఐహొపట్టణ కార్యదర్శి నరేష్‌బాబు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలని అన్నారు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివద్ధికి, స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని కొనియాడారు. మూఢ నమ్మకాలకు, కుల వివ క్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహిళా కార్యకర్త అని అన్నారు. కార్య కమంలో మహిళ ఉపాధ్యాయురాలు విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరంజన్ మధుసూదన్ సాయికుమార్ శివ కుమార్, అనిల్ కుమార్, శ్రీ రోహి, నాగ సునీల్ పాల్గొన్నారు. రామసముద్రంహొ: స్థానిక ఈస్ట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హేమలత ఆధ్వర్యంలో సావిత్రిబాయిపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో ఎంఇఒ హేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బి.కొత్తకోట : పట్టణంలోని బిసికాలనీలోని ఎంపిపి పాఠశాలలో ఎంఇఒ రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు.విద్యార్థులు,ఉపాధ్యాయులకు మిఠా యిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాజాపీర్, స్కూల్‌టీచర్లు ఉమారాణి, ఆదిలక్ష్మమ్మ, తేజన్య, గోవిం దరెడ్డిహొబాస్ నాయకులు సచిన్, పలక వెంకటేష్, సిద్దు, నక్కా మహేష్ కుమార్, కోగర వెంకటేష్, రాజు, ఎంఆర్‌సి సిబ్బంది ఉబేదుల్లా పాల్గొన్నారు. కలకడ : జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మండలంలో ఘనంగా నిర్వ హించారు.హొకలకడ ఆదర్శపాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికలగురుకుల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలతో సత్కరిం చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాల్మీకిపురం: స్థానిక తరిగొండ రోడ్డులోని రెసిడెన్షియల్ మైనార్టీ బాలికల పాఠశాలలో సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక అధ్యక్షులు ప్రభుచరణ్, ప్రిన్సిపల్ ఏఆర్ మంజుల, ఉపాధ్యాయులు నవమల్లిక, వాసంతి, సోఫియా బేగం, కోకిల, సురేఖ, రమీజా, అరుణ కుమారి, ముహినా ఖానమ్, విద్యా ర్థులు పాల్గొన్నారు. రాయచోటి : అలీమాబాద్ ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధా నోపాధ్యాయులు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నసి హత్ బేగం, గౌహరిబేగం, చాంద్ బేగం, షబానా, గౌసియా, ఫరీదా ,జగ దీష్, జయన్నా నాయక్, చాంద్ భాషా, అబ్దుల్ రహీం ఖాన్, మోమిన్ రహం తుల్లా, షబ్బీర్ అహ్మద్, నబీ ఖాన్, చిట్టిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లె : స్థానిక ఐసిడిఎస్ ఆఫీసులో సావిత్రిబాయిఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఒ సుజాత, సూపర్వైజర్లు సుగుణమ్మ, భాగ్యమ్మ, అమర, జ్యోతి, అంగన్వాడీ సిఐటియు నాయకురాలు గంగాదేవి, మధురవాణి, రాజేశ్వరి,భాగ్యమ్మ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : స్థానికి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రేఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్, జమ్రుద్ బేగం, సుజాత ,శ్రీకలవిజయ, శివశంకర్ రెడ్డి ,నిత్య పూజయ్య, సుధాకర్ , శ్రీనివాసులు ,ఆసిఫా బేగం, సుమియా, ప్రసాదు, భారతి, మురళినాయక్, అరుణకుమారి, పాల్గొన్నారు. గాలివీడు: స్థానిక బాలురు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బి.రెెడ్డెన్న ఉపాధ్యాయులందరూ కలిసి మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో గాలివీడు ప్రాథమిక వైద్యా ధికారి మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.పుల్లంపేట : మండల పరిధిలోని కొత్తపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జయంతి వేడుకలు ప్రధా నోపాధ్యాయురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్య క్రమంలో రాజయ్య, సుకన్య, శ్రీనివాసులు, రాఘవులు, సురేంద్ర, రామ సుబ్బారెడ్డి శశిధర్, పీడీ బాల శేఖర్, కష్ణవేణి, శివయ్య, శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు. సుండుపల్లిహొ: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠ శాలలో దళిత, ప్రజా సంఘాలు, బిసి నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సుండుపల్లె ప్రభుత్వ అధికారి సునీల్ కుమార్ నాయక్, మాజీ ఎంపిపి, ఎంకెఆర్ జూని యర్ కళాశాల ప్రిన్సిపల్ శైలజ, బిసి సంఘం నాయకులు రమేష్ ఆచారి, వెంకటేష్ జనసేన పార్టీ నాయకులు వీర, రాణి ,రాజా, రామ శ్రీనివాసులు ఎంఆర్‌పిఎస్ మండల అధ్యక్షుడు మహాదేవ, ఎంఎస్‌పి నాయకుడు నాగ రాజ, ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ : జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీదేవి, యూటిఎఫ్ రాజంపేట మండల శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రకౌన్సి లర్ చెంగల్‌రాజు, జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య, రమణయ్య, ప్రధానకార్యదర్శి నాగేంద్ర, పాపయ్య, ఉపాధ్యా యుల, విద్యార్థులు పాల్గొన్నారు.కలికిరి: సావిత్రిబాయిఫూలే జయంతిని రాష్ట్ర బిసి ఉద్యోగుల సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు బాలాజి అధ్యక్షతన నిర్వహిం చబడింది.హొకార్యక్రమంలో ఉద్యోగులు సుబ్రమణ్యం, హరినాధ , శ్రీనివాస్ , శంకర్, భాస్కర్, చంద్రశేఖర్ ,జనార్దన్ , మురళి ,రెడ్డిమోహన్ పాల్గొన్నారు.










