Mar 16,2023 22:18

పొట్టి శ్రీరాములు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌, తదితరులు

పుట్టపర్తి రూరల్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. పోలీస్‌ కార్యాలయం లోని కాన్ఫరెన్స్‌ హల్‌లో పొట్టి శ్రీ రాములు గారి చిత్రపటానికి ఎస్పీ శ్రీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీ రాములు పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కెవి. రామకృష్ణ ప్రసాద్‌, ఎస్‌ బి డి ఎస్‌ పి ఉమా మహేశ్వర రెడ్డి గారు, ఏ ఆర్‌ డి ఎస్‌ పి విజయ కుమార్‌ , ఏవో సుజాత ఎస్‌ బి సీఐ రవీందర్‌ రెడ్డి ఏ ఆర్‌ అడ్మిన్‌ ఆర్‌ ఐ టైటస్‌ ఆర్‌ఎస్‌ఐ లు, పోలీస్‌ కార్యాలయ సిబ్బంది , ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్‌ కార్యాలయంలో: శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని కలెక్టరు బసంత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్‌ ఇతర సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.