బహుమతి అందుకుంటున్న విద్యార్థిని
ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
నెల్లూరు :రూరల్ నియోజకవర్గం, కొండాయపాళెం ప్రాంతంలోని నగర పాలక ప్రాథమిక పాఠశాల లో బుధవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యం భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ చందవరం ఉషారాణి , 20 వ డివిజన్ కార్పోరేటర్ సతీమణి చేజర్ల కవిత విచ్చేసి రంగవల్లుల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు , వారి తల్లులకు బహుమతులు అందజేశారు. అనంతరం సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ చందవరం ఉషారాణి మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యం భాస్కర్ రావు పాఠశాలలోని విద్యార్డుల పట్ల విద్యా , సామాజిక , పోటీతత్వం, క్రమశిక్షణ ఇలా అన్నీ అంశాలలో ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , వాలంటీర్లు, విద్యార్థులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు










