మల్లు స్వరాజ్యం చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు
కదిరి టౌన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రి పాల్ వర్ధంతిని వేడుకలు శనివారం కదిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు శాంతిబాయి, అమరావతి, పూజిత, హేమావతి, సిపిఎం పట్టణ కార్యదర్శి జిఎల్. నరసింహులు, జగన్మోహన్, బాబ్జాన్, ముస్తాక్, ఫైరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలను గుర్తుకు తెచ్చుకున్నారు.










