మాట్లాడుతున్న నగర డిఎస్‌పి
సిఐటియు ఆధ్వర్యంలో
''ఘనంగా మేడే ఉత్సవాలు ఆరంభం''
నెల్లూరు :నగరంలోని విఆర్ హైస్కూల్ క్రీడా మైదానంలో జిల్లా ఆటో కార్మిక సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా ప్రారంభంమైనాయి. మంగళవారం ఈ ఉత్సవాలను నగర ట్రాఫిక్ డిఎస్‌పి ఎం.డి సుభహాన్ , ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజా ,సురేష్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ డిఎస్‌పి ఎండి. సుభహాన్ మాట్లాడుతూ ప్రతి నిత్యం ఆటో కార్మికులు యాంత్రిక జీవన విధానంతో సతమతమౌతూ బిజి బిజిగా గడుపుతుంటారని, అటువంటి వారికి ఆటవిడుపుగా ఇటువంటి పోటీలను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకొని పోటీలను నిర్వహించాలని, కార్మికులు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజా, సురేష్ మాట్లాడుతూ సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులకు దేశవ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఆటల పోటీలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో క్రికెట్, రివర్స్ గేర్ ఆటో, మ్యూజికల్ చైర్, ఇతర సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రికెట్ పోటీలకు ఇప్పటికే 10 టీములు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని, అదేవిధంగా సాంస్కతిక కార్యక్రమాలు కూడా నాలుగు రోజులు పాటు జరుగుతాయన్నారు. ఈ పోటీలతో పాటు సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ సిఐటియు ఆవిర్భావ దినం అయిన మే 30వ తేదీన పప్పులు ఇది పార్క్ వద్ద జరిగే కార్యక్రమంలో బహుమతులను అందజేస్తామన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు కార్మికులను ఐక్యం చేసేందుకు ఈ పోటీలు వేదిక కానున్నాయని అన్నారు. అనంతరం నగర ట్రాఫిక్ డిఎస్‌పి టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటి నగర అధ్యక్షులు ఏ శ్రీనివాసులు, సిఐటియు నగర నాయకులు పి సూర్యనారాయణ పి సుధాకర్ ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు నాగూర్, వెంగయ్య, మురళి, షేక్ హబీబ్, బాబురావు, జగదీష్, బాబు,చరణ్, నగరంలోని వివిధ స్టాండ్ల ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










