ఘనంగా కృషి బాడ్మింటన్ అకాడమీ వార్షికోత్సవం
ఘనంగా కృషి బాడ్మింటన్ అకాడమీ వార్షికోత్సవం
ప్రజాశక్తి -ఏర్పేడు : ఏర్పేడు మండలం కొత్త కాల్వలో కషి బాడ్మింటన్ అకాడమీలో మొదటి వార్షికో త్సవ సందర్భంగా గురునాథ హార్డ్వేర్, జై డోర్స్ సహ కారంతో గొప్ప ఓపెన్ టు ఆల్ టోర్నమెంట్ నిర్వహిం చారు. ఈ టోర్నమెంట్ కి పలు ప్రాంతాల నుంచి క్రీడా కారులు పాల్గొన్నారు. వారిలో మొదటి బహుమతి గా శశిభూషణ్ రావు, పి శరత్ కుమార్,( తిరుపతి) వారు గెలు పొందారు. రనర్స్ గా చక్రధర్ రెడ్డి, ఎస్ మహమ్మద్ వసీం గెలుపొందారు. విన్నర్స్ అండ్ రన్నర్స్ కి జై డోర్స్ అధినేత చాపల జయశంకర్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి,రూపస్, లోకేష్, కేశవులు, చాను, కిరణ్, కుడితి శేఖర్, మధు, తులసి, క్రీడాకారుల పాల్గొన్నారు.










