ప్రజాశక్తి -కందుకూరు :స్థానిక వైసిపి కార్యాలయంలో ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి కేకు కట్ చేసి క్రైస్తవ సోదరలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ క్రీస్తు ప్రేమతత్వం అందరూ అలవర్చుకోవాలన్నారు. డిఎస్‌పి కండే శ్రీనివాసరావు ,న్యాయవాది ముప్పవరపు కిషోర్, వైయస్సార్ సిపి నాయకులు కోడూరి వసంతరావు, గణేషం గంగిరెడ్డి, గేరా మనోహర్, షేక్. రఫీ, చనమాల కోటేశ్వరరావు, గంగవరపు వెంకట్రావు, తిరుపతి రెడ్డి, తొట్టింపూడి శ్రీనివాసరావు, మూరారిశెట్టి శ్రీకాంత్, చీమల వెంకటరాజా, షేక్. రహీమ్, పిడికిటి శంకర్, రాజేష్ పాల్గొన్నారు.
ఉలవపాడు : ఉలవపాడులో ఆదివారం టౌన్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘకాపరి గారైన దుగ్గిరల రత్‌న కుమార్ ఉపదేశం ఇచ్చారు. సంఘ సభ్యులు పాల్గొన్నారు. వెలిచర్ల రత్నశేఖర్ దాదాపు రూ.40,000 విలువైన రిథం పాడ్‌ను బహూకరించారు.
వలేటివారిపాలెం : మండలం లోని అన్ని గ్రామాల్లో ఉన్న చర్చిల్లో ఆదివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. క్రిస్టియన్లు చర్చిల్లో ప్రార్థనలు జరిపారు. ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని కాంక్షిం చారు. పోకూరు, వలేటివారిపాలెం, నేకునాం పురం, శాఖవరం, నలదలపూరు, శామీరపాలెం, కాకర్లపాలెం అన్ని గ్రామాల్లోనూ ప్రార్ధనలను జరిగాయి. కాకర్లపాలెంలో టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు దివి శివరాం పాల్గొని కేక్‌ను కట్ చేశారు.










