Jan 01,2023 19:42

కోరేగావ్‌ విజయోత్సవంలో నాయకులు

ప్రజాశక్తి-పీలేరు: పీలేరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 205వ భీమా కోరేగావ్‌ విజయోత్సవ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఆదివారం విశ్రాంత అధ్యాపకులు సి.చంద్రయ్య, మాల మహనాడు సీనియర్‌ నాయకులు కె.గట్టప్ప, రాష్ట్ర గిరిజన సమైక్య నాయకులు కిల్లా విజరు స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి భీమా కోరేగావ్‌ విజయోత్సవ దివస్‌ను జరిపారు. ఈ సందఠంగా వారు మాట్లాడుతూ 1818 జనవరి 1న పూణే సమీపంలోని భీమా కోరేగావ్‌లో పెషావాలపై మహర్‌ రెజిమెంట్‌ విజయం సాధించడం ద్వారా మన నిజమైన విముక్తి ప్రారంభమైందని చెప్పవచ్చని పేర్కొన్నారు. అది పెషావాలకు, బ్రిటిష్‌ సైన్యానికి మధ్య జరిగిన చిన్న యుద్ధమే అయినా అది మలుపు తిరిగిందన్నారు. ఈ యుద్ధం ద్వారా అప్పటి అంటరాని వర్గాల విముక్తి కోసం 500 మంది మహర్‌ సైనికులు పెషావాల శక్తివంతమైన సైన్యాన్ని ఓడించారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సైనికుడి కుమారుడైనందున ఈ యుద్ధం గురించి ఆయనకు బాగా తెలుసని, నివాళులు అర్పించడానికి తరచూ ఈ ప్రదేశాన్ని సందర్శించేవారన్నారు. మహర్‌ యుద్ధంలో అమరవీరుల గౌరవార్థం భీమా కోరేగావ్‌లోని యుద్ధ స్మారక చిహ్నంపై చెక్కబడిన అమరవీరులకు. 1818 జనవరి 1న యుద్ధ రంగంలో ప్రాణాలు కోల్పోయిన వీరజావాన్లకు వందనం అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు ధనాసి వెంకట్రామయ్య, ఆర్‌ ఓబులయ్య, మాలమహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్‌ కుమార్‌, అంబేద్కర్‌ సేవాదళ్‌ నాయకులు మచ్చ రెడ్డయ్య, మాలమహనాడు జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, మండల ప్రధాన కార్యదర్శి రేగంటి హరిబాబు, మండల ప్రచార కార్యదర్శి దప్పేపల్లి ఆనంద్‌, మండల కోశాధికారి మద్దెల బాలగంగాధర్‌, గుర్రం లోకనాధం, అరిపెంట ఆనంద్‌, మద్దెల జనార్దన్‌, జి.విజరు, జి.రవీంద్రబాబు, బి.నాగార్జున పాల్గొన్నారు.