May 05,2023 21:09

నివాళులర్పిస్తున్న నాయకులు

నివాళులర్పిస్తున్న నాయకులు
ఘనంగా కారల్‌ మార్క్స్‌ జయంతి
నెల్లూరు:ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఆవాజ్‌ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్‌ రామచంద్ర రెడ్డి సిపిఎం కార్యాలయంలో కార్ల్‌ మార్క్స్‌ కి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు మాట్లాడుతూ ''ఇప్పటివరకు ఉన్న అన్ని సమాజాల చరిత్ర వర్గ పోరాటాల చరిత్ర.'' పెట్టుబడిదారీ విధానం, మునుపటి సామాజిక ఆర్థిక వ్యవస్థల వలె, అంతర్గత ఉద్రిక్తతలను అనివార్యంగా ఉత్పత్తి చేస్తుందన్నారు. అది దాని నాశనానికి దారితీస్తుందని మార్క్స్‌ వాదించారన్నారు.
కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం,వి రమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌కె మస్తాన్‌బీ, ఐద్వా నాయకురాలు పద్మ, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. రషీద్‌, నాయకులు కోటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నెల్లూరు నగర్‌ కార్యదర్శి నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.