ప్రజాశక్తి-కలికిరి : జెఎన్‌టియు కళాశాల స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను మంగళవారం ప్రిన్సిపల్ ఎస్.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.అపర్ణ ఆధ్వర్యంలో మన దేశ సంస్కతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధ్యాపకులు, విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి కళాశాలకు వచ్చారు. విద్యార్థులు మన దేశ సంప్రదాయాలకు తగ్గట్టుగా బతుకమ్మ, కోలాటం, దాండియా, ఆటలను పాటలను ఆడి పాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కళాశాల దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మన దేశ సంస్కతి సంప్రదాయాలు తగ్గట్టుగా వస్త్రధారణలో రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలు సమైక్య భావాలు కలిగి మన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అందరిలో ప్రబులుతాయని తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










