Jan 25,2023 21:32

ఫొటో : కొండపనాయుడు విగ్రహానికి నివాళులర్పిస్తున్న వివిధపార్టీలనాయకులు

ఘనంగా గొట్టిపాటి కొండపనాయుడు వర్థంతి
ప్రజాశక్తి-కావలి : గొట్టిపాటి కొండపనాయుడు 21వ వర్థంతి సందర్భంగా బుధవారం ''గొట్టిపాటి కొండపనాయుడు ఛారిటబుల్‌ ట్రస్ట్‌'' జ్యోతి బాబూరావు ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలు పార్టీల నాయకులు పూలమాలేసి, ఘనంగా నివాళులర్పించారు. కావలి నియోజకవర్గంలో కొండపనాయుడు చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సేవలను గురించి వక్తలు కొనియాడారు. ఆయనతో రాజకీయాల అనుబంధం ఉన్న సిపిఎం సీనియర్‌ నాయకులు, రైతు సంఘం జిల్లా నాయకులు పులిగండ్ల శ్రీరాములు మాట్లాడుతూ గొట్టిపాటి కొండపనాయుడు చిరస్మరణీయుడన్నారు. ఎప్పుడు రాజధానికి పోయినా నాప్రజలకు రోడ్లివ్వండి!, నీళ్శ్విండి! సమస్యలు పరిష్కరించండి! అంటూ ప్రతి మంత్రిని ప్రాథేయపడి, సమస్యల పరిష్కారం కోసం పోరాడాడే తప్ప, ఎప్పుడూ తన గురించి అడగలేదన్నారు.
ఉత్తర కాలువ కోసం రైతుల కోసం మెట్ట ప్రాంతాల్లో రైతుల కోసం పోరాడారన్నారు. మారుతున్న పరిస్థితుల్లో ధనమే పరమావధిగా భావిస్తున్న రోజుల్లో తన స్వార్థం చూసుకోకుండా ప్రజలకోసం అంకితమై పనిచేశారని వివరించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మాలెపాటి సుబ్బానాయుడు, బొట్లగుంట శ్రీహరి నాయుడు, మాజీ ఎంఎల్‌ఎలు కొమ్మి లకీëనాయుడు, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, టిడిపి, వైసిపి, బిజెపి, తదితర పార్టీల నాయకులు, కొండపనాయుడు అభిమానులు, కొండపనాయుడు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, పాల్గొని నివాళులర్పించారు.