Dec 30,2022 22:46

హాస్టల్‌ విద్యార్థులతో కలసి ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న జిల్లా కార్యదర్శి

లేపాక్షి : మండల పరిధిలోని ప్రభుత్వ బాలుర వసతిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆసంఘం నాయకులు నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావం, చేసిన పోరాటాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు కిషోర్‌, లోకేష్‌, వేణు, సాయి, అనిల్‌, నరేష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. మడకశిర : పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల అవరణంలో ఎస్‌ఎఫ్‌ఐ 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈరేష్‌ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ అలుపెరగని పోరాటాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు వంశీ, మడకశిర పట్టణ అధ్యక్షులు భరత్‌, హేమంత్‌, విద్యార్థులు పాల్గొన్నారు. కదిరి టౌన్‌ : ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని కదిరిలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్‌ 14 క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు బిస్కెట్లు, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జాన్‌, జిల్లా కమిటీ సభ్యులు ఆకుల యశ్వంత్‌, విజరు కుమార్‌, నాయకులు రాజేంద్ర, సాయి కుమార్‌, నందకిషోర్‌, భార్గవ్‌, రాజేష్‌, హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.