చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పిస్తున్న నాయకులు
ఘనంగా ఎన్‌టిఆర్ వర్థంతి
వలేటివారిపాళెం:వలేటివారిపాలెంలో బుధవారం జరిగిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 27వ వర్థంతి కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దివి కొండయ్య చౌదరి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు దివి శివరాం, మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, ఇతర నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని నేకునాంపురం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని బ్రహ్మం గారి చెట్టు వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నడిపినేని లక్ష్మీనరసింహం, నాయకులు కొల్లూరి మాధవరావు, కొల్లూరి వెంకటేశ్వర్లు, నవులూరి నరసింగ రావు, కంచర్ల బాబురావు, మహేంద్ర, కంచర్ల రమేష్ పాల్గొన్నారు.










