Jan 18,2023 20:29

ఎన్‌టిఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న టిడిపి నాయకులు


లక్కిరెడ్డిపల్లి : మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు వర్ధంతి సందర్భంగా రాయచోటి టిడిపి ఇన్‌ఛార్జ్‌ రమేష్‌ కుమార్‌రెడ్డి స్వగహంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల ఆరా ధ్యదైవం, తెలుగుజాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామా రావు అని కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా, మాజీ ఎంపిపి ఉమాపతి రెడ్డి, రాయచోటి రూరల్‌ టిడిపి అధ్యక్షులు మురికినాటిసుబ్బారెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సారెడ్డి, మాజీ కో-ఆప్షన్‌ మెంబర్‌ అజంతుల్లా, బడుగు వాసుదేవుడు, రామకష్ణ గౌడ్‌, సర్పంచులుకేశవయ్య , మాజీ ఎంపిటిసి చండ్రాయుడు, ధర్మరాజు ,డాక్టర్‌ షఫీనాయక్‌, నాగేంద్రరాజు, దిలీప్‌రాజు, మంజూరు, బోనాల ధన, టిడిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. నిమ్మనపల్లి : నందమూరి తారకరామారావు 27వ వర్ధంతిని మండల మాజీ అధ్యక్షులు రెడ్డెప్పరెడ్డి, మండలాధ్యక్షులు వెంకటరమణ, మండల తెలుగుయువత అధ్యక్షులు చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలసి నిమ్మనపల్లి, వెంకో జీగారిపల్లిలో ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్‌.జె.వెంకటేష్‌, నాయకులు ముని రత్నం, సుధాకర్‌రావు, మల్లికార్జున, లక్ష్మన్న, చిన్నబాబు, మేష రామకష్ణ, విజరు, మురళీ మోహన్‌, దేవేందర్‌రెడ్డి, రెడ్డప్పరెడ్డి, నరేంద్ర, ఖాసింఖాన్‌, చంద్ర, భూపతి, గోపి పాల్గొన్నారు.కలికిరి : తారక రామారావు 27వ వర్ధంతిని క్రాస్‌రోడ్‌ నాలుగు రోడ్లకూడలిలో ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నిజాముద్దీన్‌ ఉపాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మాజీ ఎంపిపి రహమతుల్లా, అగస్తీశ్వర్‌, ఎస్‌టి సెల్‌ నాయకులు శ్రీనివాస్‌ వర్మ, సహదేవ రెడ్డి, వెంకట్‌ నారాయణ రెడ్డి, లాయర్‌ రాంప్రసాద్‌, ధరణి సత్యారెడ్డి, ఎల్లప్ప, లేపాక్షి అసలం, యువ నాయకుడు అఫ్రోజ్‌ భాష, సనావుల, ఐటిడిపి షబ్బీర్‌ హుస్సేన్‌, మాజీ ఎంపిటి సి జనార్దన్‌గౌడ్‌ పాల్గొన్నారు. కలకడ: నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలకడలో రక్తదాన శిబిరం నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి చే ప్రారంభించారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు ప్రభాకర్‌ నాయుడు, సర్పంచ్‌ విశ్వనాథనాయుడు, గుర్రం శివకుమార్‌, మాజీ మండ లఅధ్యక్షులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు మల్లి కార్జున నాయుడు, వెంకటరమణ, రెడ్డప్ప, యశస్వి, పరిటాల శేఖర్‌ నాయుడు, సుకూర్‌ అహ్మద్‌, కరిముల్లా, వై జిలానిభాష, జిరాక్స్‌ అల్లి, శేఖర్‌ నాయుడు, రవి, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.గుర్రంకొండ : తారక రామారావు 27వ వర్ధంతి వేడుకలు బస్టాండ్‌ ఆవరణ నందు ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు ఏజాజ్‌ అహ్మద్‌ రెడ్డి, శేఖర్‌, మాజీ సర్పంచ్‌ నౌషాద్‌ అహ్మద్‌, నాయకులు మేకల చలపతిచలమారెడ్డి ఎల్లుట్ల మురళి రామయ్య పాల్గొన్నారు. రామాపురం : మండలంలోని నీలకంఠరావుపేట గువ్వల చెరువుఎన్‌.టి.రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయ కులు కార్యకర్తలు ఆజామ్‌, హరిప్రసాద్‌, కుమార్‌, షంషీర్‌, జాఫర్‌ఖాన్‌, ఉదరు, మహమ్మద్‌, పర్వేజ్‌ పాల్గొన్నారు. రాయచోటి: ఎన్‌టి.రామారావు 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండలం కమ్మపల్లి వద్ద మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డి, మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు సుగువాసి ప్రసాద్‌ బాబు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజులు ఖాదర్‌ బాషా ,టిడిపి మండల అధ్యక్షులు వెంకటసుబ్బారెడ్డి, నాయకులు సుబ్బయ్య నాయుడు పాల్గొన్నారు. ములకలచెరువు : మూడు రోడ్లు కూడలిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకలు మండల పార్టీ కన్వీనర్‌ పాలగిరి సిద్ద ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాయచోటి : పట్టణంలోని మండిపల్లి భవన్‌లో రాంప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌టి.రామారావు చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో విష్ణువర్ధన్‌ రెడ్డి, చీర్ల సుధాకర్‌, శివారెడ్డి, ఆంజీనేయులురెడ్డి, పదిలంశివ, మస్తాన్‌వలి పాల్గొన్నారు.వీరబల్లి : ఎన్‌టిఆర్‌ 27వ వర్ధంతిని రాజంపేట నియోజకవర్గ టిడిపి సీనియర్‌ నాయకుడు తాటిగుట్ల శ్రీధర్‌ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు బాణుగోపాల్‌ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్‌ ఆవరణంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్‌ చిత్ర పటానికి. పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్‌ వినరు బాబు,వీఆర్డీఎస్‌ సురేం ద్రారెడ్డి, తుమ్మల రమేష్‌, గుదే నాగార్జున,భాస్కర్‌ రాజు, సుధాకర్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు అంజనేయుల రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి సురేంద్ర,పవన్‌ పాల్గొన్నారు.పెద్దమండ్యం : మండలంలోని బస్టాండ్‌ వద్ద టిడిపి మండల అధ్యక్షుడు జిట్టా వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆస్పత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు అవికెనాయిక్‌, తాండ సర్పంచ్‌ నటరాజ నాయిక్‌, ప్రధాన కార్యదర్శి కాలేషా, తెలుగు యువత అధ్యక్షుడు నారగంగాధర్‌, తెలుగు విభాగ రైతు అధ్యక్షుడు తుమ్మల మహే శ్వర, మైసూర్‌ శ్రీనివాసులు, ప్రచారకార్యదర్శి సాంబ, ఎల్‌ఐసి సీనా, హసిమ్‌ సాహెబ్‌, పెద్దన్న, రఫీ, మస్తాన్‌ ఖాన్‌, తిమ్మయ్య చలపతి నాయుడు, మధు కర్‌ యాదవ్‌, చిన్న రెడ్డిభాష, నూర్‌ సాబ్‌ భరత్‌, రామచంద్ర పాల్గొన్నారు. పుల్లంపేట : మండలపరిధిలోని టి.కమ్మపల్లి క్రాస్‌రోడ్‌ రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఉన్న ఎన్‌.టి.రామారావు విగ్రహానికి మండల టిడిపి అధ్యక్షులు ఆర్‌.కె.సుధాకర్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నేలపాటి రామచంద్రయ్య నాయుడు, టిడిపి ఉపాధ్యక్షులు కాపర్ల చంద్రశేఖర్‌ నాయుడు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ పోలీ జగదీశ్వర్‌ రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కువైట్‌ జనరల్‌ సెక్రటరీ మారోతు మల్లి, బిసి నాయకులు వెంకటసుబ్బయ్య యాదవ్‌, గండికోట రామకష్ణయ్య, మస్తాన్‌వల్లి, సుధాకర్‌రెడ్డి, పోలినేని సుబ్బరయుడు నాయుడు, బలగాల నరసింహులు, కాకర్లప్రభాకర్‌, కొండంపల్లి మల్లి, పోతినేనిభరత్‌, రోహిత్‌ పాల్గొన్నారు.