ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: పట్టణంలో శ్రీ అన్నమయ్య ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్ డే సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. శ్రీపవన్ ఎలక్ట్రికల్స్, నందిని ట్రేడర్స్, ఎస్‌ఎల్‌ఎస్ ఎలక్ట్రికల్స్, శ్రీసాయి శ్రీనివాస ట్రేడర్స్, పద్మావతి ఎలక్ట్రికల్స్, ఎస్.ఎం.ట్రేడర్స్ సహకారంతో వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం సీనియర్ ఎలక్ట్రీషియన్లను, ఎలక్ట్రీషియన్ దుకాణదారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కార్మిక అసిస్టెంట్ కమిషనర్ పి.పద్మావతి పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రయివేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా ఉప కార్యదర్శి బి.నరసింహులు, శ్రీ అన్నమయ్య ప్రయివేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తరుణి కుమార్, అధ్యక్షులు కెవికెఎస్ వర్మ, ఉపాధ్యక్షులు మహంకాలయ్య, ప్రధాన కార్యదర్శి సంజీవ నాయుడు, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, కోశాధికారి సురేష్‌బాబు, నిర్వాహకులు నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. పీలేరు: బహుజన సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎ.బలరాం అధ్యక్షతన ఎలక్ట్రీషియన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల బోర్డు నుండి అర్హలైన కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కార్యదర్శి అఫీజుల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ప్రభాకర్ రాజు, కార్యదర్శి రస్షుల్, కోశాధికారి ఎన్టీఆర్ నఫీస్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహబూబ్ బాష, పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, పులిచెర్ల మండల నాయకులు రవి, రొంపిచెర్ల మండల నాయకులు లక్ష్మయ్య, నాయకులు రహంతుల్లా, శ్రీరాములు, సయ్యద్ బాష, కమాలుద్దీన్, శ్రీనివాసులు, సమీర్, సుహేల్, యాషీన్ పాల్గొన్నారు.










