Jan 14,2023 21:30

ధర్మవరంలో భోగిమంటలు వేసుకుంటున్న దృశ్యం

         ప్రజాశక్తి-బత్తలపల్లి   మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారం భమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకూ వాడవాడలా, వీధివీధిలో, ప్రతి ఇంటి ముంగిట భో గి మంటలు వేశారు. వయోభేదం లేకుండా, చలిని లెక్కచేయ కుండా భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కాగా బత్తలపల్లి శివాలయం వద్ద శివదీక్షపరులు భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. భోగి పళ్లును చిన్నారులపై పోసి దిష్టితీశారు.
ధర్మవరం టౌన్‌ : సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ పెనుజూరు నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున భోగి మంటలు వేసి పూజలు చేశారు.ఉదయం ప్రతి ఇంటిలో బోగిస్నానాలు చేసి ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులను వేశారు. కాగా ప్రజలు అనపకాయ, గుమ్మడికాయ, చెరుకుగడ్డ, రేణుకాయ, పూలు నెత్తిన పెట్టుకుని తెల్లవారుజామునే భోగిస్నానం చేశారు.
కొత్తచెరువు : మండల వ్యాప్తంగా భోగి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున తమ ఇళ్ల ముందు భోగిమంటలు వేసి పూజలు చేశారు. తర్వాత ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి, అందులో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు.